logo

'సమగ్ర శిక్ష' స్కీమ్‌లో 704 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు


24-Nov-2019 02:17IST
Increase application deadline for 704 jobs under Comprehensive Punishment Scheme

తెలంగాణలో డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్లో శిక్షణ కలిగి ఉన్న నిరుద్యోగ యువతకు శుభవార్త. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే సమగ్ర శిక్షకు సంబంధించి 704 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మంకు తెలిసిందే. ఈ క్రమంలో దరఖాస్తు గడువు నవంబర్ 26 వరకు పెరిగింది. మొత్తం 704 ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, సిస్టమ్ ఎనలిస్ట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. సమగ్ర శిక్ష అధికారిక వెబ్‌సైట్‌లో https://samagrashiksha.telangana.gov.in/ అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్ లాంటి అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష ఇంగ్లీష్, తెలుగు మాధ్యమంలో ఉంటాయని అధికారులు వెల్లడించ్చారు. 


మొత్తం ఖాళీలు- 704
ఎంఐఎస్ కోఆర్డినేటర్- 144
సిస్టమ్ అనలిస్ట్- 12
అసిస్టెంట్ ప్రోగ్రామర్- 27
ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్- 383
డేటా ఎంట్రీ ఆపరేటర్- 138

విద్యార్హతల వివరాలివే...
ఎంఐఎస్ కోఆర్డినేటర్- బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) లేదా బీఎస్సీ (ఎంపీసీ) పాస్ కావడంతో పాటు పీజీడీసీఏ సర్టిఫికెట్ ఉండాలి. లేదా బీసీఏతో పాటు ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్- ఏదైనా డిగ్రీతో పాటు డీసీఏ, ఎంఎస్ ఆఫీస్.
సిస్టమ్ అనలిస్ట్- బీకామ్ / ఎంకామ్‌ / ఎంబీఏ (ఫైనాన్స్) అర్హతతోపాటు ట్యాలీ 9 ఈఆర్‌పీ అకౌంటింగ్ ప్యాకేజీ తెలిసుండాలి.
అసిస్టెంట్ ప్రోగ్రామర్- ఎంసీఏ లేదా బీటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంఎస్సీ (కంప్యూటర్స్) పాస్ కావడంతో పాటు ఒరాకిల్ తెలిసుండాలి.
ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్- ఇంటర్మీడియట్‌తో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా లేదా డిగ్రీతో పాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్).

వివరాలు: 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 26
హాల్ టికెట్ల డౌన్‌లోడ్- 2019 డిసెంబర్ 2వ వారం
ఆన్‌లైన్ ఎగ్జామ్- 2019 డిసెంబర్ 2వ వారం
వయస్సు- 2019 జూలై 1 నాటికి 34 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.600గా చెల్లించాల్సి ఉంటుంది. 
job కోసం చిత్ర ఫలితం

job కోసం చిత్ర ఫలితం

Tags: Increase application deadline 704 job notifications

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top