logo

నోరూరించే వేటమాంసం గోంగూర


24-Nov-2019 05:35IST
tasty gongoora vetamamsam

నాన్ వెజ్ ప్రియులు తమకు ఇష్టమైన వంటల రుచులను ఆస్వాదించేందుకు ఆదివారం వచ్చిందంటే చాలు ఆరోజు వంటిల్లు మొత్తం మంచి మసాలా ఘాటు వాసనతో గుమగుమలాడి పోతుంది. లేదా  రెస్టారెంట్లకు వెళ్లి భారీగా ఖర్చు పెడతారు. కానీ కొన్ని హోటల్స్ లో మాత్రం మనం ఖర్చు చేసిన దానికి సరైన రుచితో కూడిన వంటలను ఆస్వాదించలేకపోతుంటాం. అలాంటి వారికోసం ఎంతో రుచికరంగా.. అతి తక్కువ సమయంలో వేట మాంసానికి గోంగూర కలిపి చేసే వేటమాంసం గోంగూర ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు చూద్దాం.   

కావలసిన పదార్థాలు; 

తాజా మటన్‌ మాంసం - అర కిలో, 
గోంగూర- 3 కట్టలు, 
తరిగిన పచ్చిమిర్చి- 6, 
పసుపు- ఒక టీ స్పూను, 
అల్లంవెల్లుల్లి ముద్ద- ఒక టేబుల్‌ స్పూను, 
గరం మసాలా- ఒక టీ స్పూను,
 తరిగిన ఉల్లిపాయ- ఒకటి, 
నూనె- ఒక టేబుల్‌ స్పూను, 
కారం- 2 టీ స్పూన్లు, 
ధనియాల పొడి- ఒక టీ స్పూను,
 జీలకర్ర పొడి- అర టీ స్పూను, 
ఉప్పు- తగినంత.

తయారీ విధానం : కుక్కర్‌లో మటన్‌, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి నాలుగు విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించాలి. తర్వాత బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయలు, గరం మసాలా వేసి ఒక నిమిషం సేపు వేగించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, పచ్చిమిర్చి, గోంగూర వేసి బాగా కలిపి చిన్న మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత ఉడికిన మటన్‌, తగినంత ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు ఉడికించి దించేయాలి.


gongura mamsam కోసం చిత్ర ఫలితం

Tags: tasty gongoora vetamamsam sunday special

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top