logo

ఆపిల్ రింగ్స్ వెరైటీగా..


26-Nov-2019 03:21IST
appile rings easy preparation

ఆపిల్స్ ఆరోగ్యానికి ఎంత మేలో అందరికి తెలిసిన విషయమే.. అయితే ఈ ఆపిల్స్ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అంతకు మించిన విదంగా ఆపిల్ తో అనేక రకాల వాటాలు కూడా చేసుకోవచ్చునట. అయితే ఈ ఆపిల్స్ తో వెరైటీగా ఆపిల్స్ రింగ్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. 

కావలసిన పదార్థాలు:
 
ఆపిల్‌ రింగ్స్‌ - 12 లేదా 15 (ఆపిల్‌ కాయను శుభ్రం చేసుకుని కొద్దిగా మధ్యలో భాగం తొలగించి రింగ్స్‌లా సిద్ధం చేసుకోవాలి),
 చిక్కటి మజ్జిగ - 1 కప్పు, 
గుడ్లు - 3, 
మైదాపిండి - ఒకటిన్నర కప్పులు, 
పంచదార పొడి - 3 లేదా 4 టేబుల్‌ స్పూన్లు, 
యాలకుల పొడి - అర టీ స్పూన్, 
దాల్చినచెక్కపొడి - అర టీ స్పూన్, 
బేకింగ్‌ పౌడర్‌ - 1 టీ స్పూన్, 
జాజికాయ పొడి - పావు టీ స్పూన్‌,
 ఉప్పు - కొద్దిగా, 
నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా

తయారీ విధానం : 

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని మైదాపిండి, 2 టేబుల్‌ స్పూన్ల పంచదార పొడి, దాల్చినచెక్క పొడి, యాలకుల పొడి, జాజికాయ పొడి, బేకింగ్‌ పౌడర్, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గుడ్లు వేసుకుని.. కొద్దికొద్దిగా మజ్జిగ వేసుకుని బజ్జీల పిండిలా సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఆపిల్‌ రింగ్స్‌ని మైదా మిశ్రమంలో ముంచి నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పంచదార పొడి వాటిపైన వేసుకుని వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Image result for apple rings

Tags: appile rings easy preparation

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top