logo

ఐఫోన్‌ శ్రీ ఆర్‌ తయారీ ఇక మనదేశంలోనే అట..!


26-Nov-2019 03:35IST
iphone shree r now making in india

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఎంతో ప్రీతీ కరమైన స్మార్ట్ ఫోన్ గా గుర్తింపు పొందిన ఏకైక సంస్థ యాపిల్. ఇప్పుడు ఈ యాపిల్ భారత్ లోని అనేక ప్రాంతాలల్లో మరింత విస్తరించనుంది. ఇప్పటికే దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతి కోసం ఐఫోన్‌ 6ఎస్‌, 7, శ్రీ ఆర్‌తో పాటు మరిన్ని మోడళ్లను ఇక్కడే రూపొందిస్తోంది. తాజాగా యాపిల్‌ ప్రధాన సరఫరాదారు అయిన సాల్‌కాంప్‌ 2020 నుంచి అయిదేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అందుకు గాను చెన్నై మహానగరంలోని మూతపడిన నోకియా ప్లాంటును టేకోవర్‌ చేసుకోవడానికి సాల్‌కాంప్‌ ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు మంత్రి వివరించారు. వచ్చే మార్చి నుంచి ఆ సంస్థ కార్యకలాపాలు మొదలుపెడుతుందని, తద్వారా ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 50,000 మందికి ఉపాధి లభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.   


i phone sree r కోసం చిత్ర ఫలితం

Tags: iphone shree r making in india

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top