logo

త్వరలో షావోమీ 'బ్లాక్ ఫ్రైడే సేల్' ప్రారంభం


26-Nov-2019 05:50IST
xiaomi announce black friday sale

స్మార్ట్ టీవీల కొనుగోలుదారులకు శుభవార్త..! త్వరలో భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో మరో అద్భుతమైన సేల్ ని ప్రారంభించబోతున్నట్టు షావోమీ 'బ్లాక్ ఫ్రైడే సేల్'ని ప్రకటించింది. ఈ భారీ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ సేల్ జరగనుంది. ఈ స్మార్ట్ టీవీల కొనుగోలుకు సంభందించిన షావోమీ అఫీషియల్ వెబ్‌సైట్ అయిన Mi.com, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్ జరగనుంది. దీనికి సంబంధించి సేల్‌లో ఉండే డీల్స్ మాత్రం రివీల్ చేయలేదు. రెండు మూడు రోజుల్లో డీల్స్ గురించి క్లారిటీ ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే గడిచిన పండుగలను బాగానే ఉపయోగించుకున్నషావోమీ... 'బ్లాక్ ఫ్రైడే సేల్'ను అంతే ఘనంగా నిర్వహించే అవకాశముంది. ఇప్పటికే ఇండియాలో రియల్‌మీ, ఒప్పో, వివో, వన్‌ప్లస్, సాంసంగ్ లాంటి కంపెనీలతో గట్టి పోటీ ఎదుర్కొంటున్న షావోమీ... 'బ్లాక్ ఫ్రైడే సేల్'లో భారీ ఆఫర్లు అందించే అవకాశముంది. అయితే ఈ సేల్‌లోనే 108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ లేదా 75 అంగుళాల రెడ్‌మీ టీవీ లాంఛ్ చేసే అవకాశముందని అంచనా. 

Read latest Technology News and Telugu News   Follow us on FacebookTwitter 

Xiaomi Black Friday Sale: స్మార్ట్‌ఫోన్, టీవీ కొనాలా? బీ రెడీ... ఆఫర్లు వచ్చేస్తున్నాయి

Tags: xiaomi black friday sale new xiaomi product technology news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top