logo

ఐపీఎల్ 2020 అనంతరం ధోనీ వీడ్కోలు..?


26-Nov-2019 20:45IST
dhoni goodbye to cricket after ipl 2020

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 తర్వాత టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ తన భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోనున్నాడని సమాచారం. ప్రస్తుతం తన కెరీర్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాలనే ఉద్దేశంతోనే ధోని ఉన్నాడని అతడి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో తన ప్రస్థానం ముగించిన తరువాత ధోని క్రికెట్ స్టేడియంలోకి అడుగుపెట్టి సుమారు ఐదు నెలలు దాటింది. ఆ మధ్య కాలంలో ధోని తన రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత భారత ఆర్మీలో సేవలు అందించాడు. అంతేకాదు సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్ లతో జరిగిని టోర్నీల్లో ధోనీ అందుబాటులోకి రాలేదు. అంతేకాదు  క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. విరామం సమయం ముగిసి కూడా ఐదు నెలలు కావస్తున్నా.. ధోనీ భారత సెలెక్టర్లకు అందుబాటులో ఉంటానని ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం ఫిట్నెస్ పరంగా దృడంగా ఉన్నా ధోని కొద్దీ రోజుల నుండి క్రికెట్ ఆడేందుకు కఠోర సాధన చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే అయితే వచ్చే సంవత్సరం ధోనీ కీలక మైన నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే రిటైర్మెంట్ పై ధోనీ చాన్స్ తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత చిత్రం




Tags: dhoni goodbye cricket ipl 2020

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top