logo

ఇంటర్ పాసైతే ఇండియన్ నేవీలో ఉద్యోగం


27-Nov-2019 01:48IST
Indian navy jobs for inter qualifiers

ఇండియన్ నేవీలో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా..? ఐతే మీకె ఈ శుభవార్త..! మీరు ఇంటర్ పాసయితే చాలు..ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో చేరడానికి మంచి అవకాశమిది. ఇండియన్ నేవీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ప్రకటించింది. ఎంపికైనవారు నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ అవకాశం పెళ్లికాని అబ్బాయిలకు మాత్రమే వర్తిస్తుంది. కేరళలోని నావల్ అకాడమీలో 2020 జూలైలో బ్యాచ్ ప్రారంభమవుతుంది. అందుకోసం ప్రభుత్వం దరఖాస్తులను విడుదల చేయనుంది. నవంబర్ 29న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై డిసెంబర్ 19న ముగియనుంది. ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ www.joinindiannavy.gov.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారికి విశాఖపట్నం, బెంగళూరు, భోపాల్, కొయంబత్తూరులో 2020 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య ఇంటర్వ్యూలు ఉండనున్నాయి.

మొత్తం ఖాళీలు- 37
దరఖాస్తు ప్రారంభం- నవంబర్ 29- 2019
దరఖాస్తుకు చివరి తేదీ- డిసెంబర్ 19- 2019 
విద్యార్హత:
 ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 70% మార్కులు, ఇంగ్లీష్‌లో 50% మార్కులతో 10+2 పాస్ కావాలి. జేఈఈ మెయిన్ 2019 పరీక్షకు హాజరైనవారు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు:
2001 జనవరి 2 నుంచి 2003 జూలై 1 మధ్య జన్మించాలి.

indian navy jobs కోసం చిత్ర ఫలితం

Tags: Indian navy jobs inter qualifiers

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top