logo

పిఎస్‌ఎల్‌వి సి-47 కౌంట్ డౌన్ శురూ..!


27-Nov-2019 02:24IST
pslv c47 countdown start

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన (షార్‌)లో నేడు ప్రయోగించనున్న పిఎస్‌ఎల్‌వి-సి47 రాకెట్‌ను ఈ రోజు ఉదయం 9.25 నిముషాలకు ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ మంగళవారం ఉదయం 7.28 నిముషాలకు ప్రారంభమైంది. ఇది నిరంతరం 26గంటలు కౌంట్‌ డౌన్‌ తర్వాత 9.25 నిముషాలకు ప్రయోగం చేయనున్నారు. ఈ  పిఎస్‌ఎల్‌వి-సి47 రాకెట్‌ ద్వారా కార్టో శాట్‌ - ఫ్రీ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు.  షార్‌ నుంచి ఇది 74వ రాకెట్‌ ప్రయోగం.కార్టోశాట్‌-3 ఉపగ్రహం నిఘూకు ఉపయోగపడుతూ దేశ సైనిక సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, తీరప్రాంత నిర్వహణ, రహదారుల నెట్‌వర్క్‌ పరిశీలన, నీటి సరఫరాపై అధయయనానికి వినియోగిస్తారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పందం మేరకు 24మినీ ఉపగ్రహాలను కమర్షియల్‌ లాభాల కోసం మన రాకెట్లతో పాటే ప్రయోగిస్తుం డడం విశేషం. ఇప్పటికే షార్‌కు ఇస్రోలోని వివిధ విభాగాల డైరెక్టర్లు, సీనియర్‌ శాస్త్రవేత్తలు చేరుకున్నారు.

సంబంధిత చిత్రం

Tags: pslv c-47 countdown start 9:25am

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top