logo

బాబు అలా అన్నారు... వైఎస్ మ‌ర‌ణంపై చీఫ్ విప్ అనుమానాలు


27-Nov-2019 15:47IST
chief wip srikanth raise many doubts in ys death

మాతో పెట్టుకుంటే మటాష్ అని చంద్రబాబు  గతంలోనూ అసెంబ్లీలో  అప్ప‌టి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై  వ్యాఖ్యలు చేశారని.. ఆ మరుసటి రోజే వైఎస్ కనిపించకుండా పోవడం.. మరణంపై ఇప్పటికీ అనుమానాలున్నాయంటూ ప్రభుత్వ చీఫ్ విప్, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.   ఈ విషయంపై   సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. గత ఎన్నికల్లో ప్రజలు ఛీత్కరించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని, అధికారం లేక ఆత‌నికి మతిభ్రమించిందని..అందుకే నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నాడ‌ని మండి ప‌డ్డారు.  

నెల‌లు గుడుస్తున్నా వైఎస్ వివేకా హత్య కేసు ఛేదించలేకపోయారని టీడీపీ   చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారాయ‌న‌. ఈ కేసులో చాలా పకడ్బందీగా అధికారులు విచారణ చేస్తున్నార‌ని, వివేకా హత్య.. ఆ తరువాత చంద్రబాబు చేసిన కుట్రల‌తో స‌హా  అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి గా మాట్లాడ‌కుండా ఇష్ట‌మెచ్చిన తీరుగా చంద్ర‌బాబు మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు. ఎన్టీఆర్ మ‌ర‌ణంపైనా విచార‌ణ చేసేందుకు తాము సిద్ద‌మేన‌ని ఇందుకు చంద్ర‌బాబు అంగీక‌రిస్తాడా? అని నిల‌దీసారు. 

Read latest Andhra Pradesh News and Telugu News Follow us on FaceBookTwitter

Tags: chief wip srikanth reddy gadikota many doubts ys death

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top