logo

రికార్డు స్థాయిలో లాభాల జోరు..


27-Nov-2019 19:17IST
stock market record profit margins

నేడు దేశీయ మార్కెట్లు భారీ స్థాయిలో రికార్డులను బద్దలు కొట్టి భారీ లాభాలతో ముగిసాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు కొద్దీ సేపటి తరువాత తగ్గుముఖం పట్టాయి. మిడ్  సెషన్‌ తరువాత మల్లి వేగాన్ని పుంజుకుని అత్యధిక స్థాయిల వద్ద రికార్డుల నమూనాని సొంతం చేసుకుంది. సెన్సెక్స్‌ 199 పాయింట్లు ఎగిసి 41021 వద్ద,  మొదటిసారి 41 వేల ఎగువన స్థిరపడింది. నిఫ్టీ 63 పాయింట్లు ఎగిసి  తొలిసారిగా 12100 వద్ద ముగిసాయి. 

బ్యాంకింగ్‌ రంగ లాభాలతో అటు బ్యాంక్‌ నిఫ్టీ కూడా రికార్డు ముగింపును నమోదు చేసింది.  ఎస్‌బీఐ కార్డు ఐపీవోకు  రానుందన్న సమాచారంతో చివర్లో సూచీలు బాగా పైకి ఎగిశాయి. వీటితోపాటు ఆటోమొబైల్, ఎనర్జీ స్టాక్స్‌లో లాభాలు మార్కెట్లను  లీడ్‌ చేసాయి. యస్‌ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బీఐ, మారుతి సుజుకి, హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్ ఇండస్ట్రీస్,  హిందాల్కో టాప్‌  గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు, భారతి ఇన్‌ఫ్రాటెల్, సిప్లా,ఎల్‌ అండ్‌, ఐటీసీ ఐసిఐసిఐ బ్యాంక్ నష్టపోయిన వాటిల్లో  టాప్‌లో ఉన్నాయి.  




Tags: stock market record profit sensex

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top