logo

మార్కెట్లో విడుదలకు సిద్దమైన రెడ్‌మి నోట్‌ 8


27-Nov-2019 21:15IST
redmi Note 8 is ready for release in the market

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో పెరిగిపోతున్న పోటీ కారణంగా పలు దిగ్గజ మొబైల్ పరిశ్రమలు ఒక మెట్టు దిగి కిందకు వస్తున్నాయి. ఈ క్రమంలో షావోమి రెడ్‌మి నోట్ 8లో కాస్మిక్‌  పర్పుల్‌ వేరియంట్‌ను సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరకే ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది గత నెలలో ఈ స్మార్ట్‌ఫోన్  లాంచింగ్‌ సందర్భంగా దీనిపై  అంచనాలను భారీగా పెరిగాయి. రెడ్‌మి నోట్ 8 కాస్మిక్ పర్పుల్ కలర్ వేరియంట్ అమెజాన్‌, ఎంఐ.కాం ద్వారా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు  కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని షావోమి కంపెనీ ప్రకటించింది. కొత్త కాస్మిక్ పర్పుల్ కలర్ ఎంపికతో పాటు, ఇతర కలర్‌ ఆప్షన్లలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లు లభించనున్నాయి. 

రెడ్‌మి నోట్ 8 వివరాలు:
6.39 అంగుళాల  ఫుల్‌ హెచ్‌డి  డిస్‌ప్లే,
1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్‌,
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665  సాక్‌
ఆండ్రాయిడ్ 9 పై
48+8+2+2 ఎంపీ క్వాడ్‌ కెమెరా 
13 ఎంపీ సెల్పీ కెమెరా  
పవర్ ఫుల్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.  

ధరలు 
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ రూ. 9,999  
6జీబీ  ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌  రూ. 12,999 




Redmi Note 8 Cosmic Purple Colour Variant Launched in India  - Sakshi

Tags: redmi Note 8 ready for release indian market

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top