logo

జనవరి వరకు నన్ను ఏం అడగొద్దు: ధోని


28-Nov-2019 05:45IST
dont ask me till january dhoni

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 తర్వాత టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ తన భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోనున్నాడని సమాచారం. ప్రస్తుతం తన కెరీర్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించాలనే ఉద్దేశంతోనే ధోని ఉన్నాడని అతడి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో తన ప్రస్థానం ముగించిన తరువాత ధోని క్రికెట్ స్టేడియంలోకి అడుగుపెట్టి సుమారు ఐదు నెలలు దాటింది. ఆ మధ్య కాలంలో ధోని తన రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత భారత ఆర్మీలో సేవలు అందించాడు. అంతేకాదు సౌతాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్ లతో జరిగిని టోర్నీల్లో ధోనీ అందుబాటులోకి రాలేదు. అంతేకాదు  క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. దీనిపై ధోని మొదటిసారి స్వయంగా స్పందించాడు. అదీ ఏకవాక్యంలో! పునరాగమనం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...‘జనవరి వరకు నన్నేమీ అడగొద్దు’ అని తేల్చేశాడు. బుధవారం ‘పనెరై’ అనే వాచీ కంపెనీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ధోని తన కెరీర్‌కు సంబంధించిన రెండు అత్యుత్తమ క్షణాలను పంచుకున్నాడు.

‘సుదీర్ఘ కెరీర్‌లో రెండు సంఘటనలు నా మనసుకు అత్యంత చేరువగా నిలిచాయి. అలాంటివి మళ్లీ రావు. 2007 టి20 ప్రపంచ కప్‌ గెలిచి స్వదేశం తిరిగొచ్చిన తర్వాత ముంబైలో ఓపెన్‌ టాప్‌ బస్సులో ఊరేగింపు జరిగింది. ఆ సమయంలో ప్రఖ్యాత మెరైన్‌ డ్రైవ్‌ ఈ మూల నుంచి ఆ మూల వరకు పూర్తిగా నిండిపోయింది. తమ పనులన్నీ వదిలేసుకొని వారంతా మా కోసం మా వెనకాలే వచ్చారు. వారి కళ్లలో ఎంతో ఆనందం కనిపించింది. ఇక 2011 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో విజయానికి 1520 పరుగుల దూరంలో ఉన్నప్పుడు స్టేడియంలో ప్రేక్షకులు వందేమాతరం నినాదంతో హోరెత్తించారు’ అని ధోని గుర్తు చేసుకున్నాడు.  కెప్టెన్‌గా తాను ఎన్ని విజయాలు సాధించినా ఇంట్లో మాత్రం భార్య సాక్షి మాటే చెల్లుబాటు అవుతుందని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు. వయసుతో పాటు భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత దృఢమవుతుందని అతను అభిప్రాయపడ్డాడు. 


MS Dhoni To Take Call On His Cricketing Future After January - Sakshi

Tags: don't ask me till january dhoni

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top