logo

గవర్నర్‌గా ముత్తయ్య మురళీధరన్‌


28-Nov-2019 06:42IST
muttiah muralitharan take charge as governor

శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్‌ ప్రావిన్స్ గవర్నర్ గా బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్‌ పదవిని స్వీకరించాలంటూ లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స స్వయంగా విజ్ఞప్తి చేశారని సమాచారం. అంతే కాకుండా మురళీధరన్‌ తో పాటుగా అనురాధ యహంపతి ఈస్ట్ ప్రావిన్స్, తిస్స వితర్ణ నార్త్  సెంట్రల్ ప్రావిన్స్ లకు గవర్నర్ బాధ్యతలు అప్పగించనున్నారని అధికార వర్గాల సమాచారం. శ్రీలంక తరఫున ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్ లో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి మనకు విదితమే. అంతే కాకుండా తన సుదీర్గ ప్రయాణంలో అత్యధిక వికెట్లను కొల్లగొట్టిన ఆటగాడిగా కూడా కీర్తిని సంపాదించాడు. శ్రీలంక తరుపున 133 టెస్టులు ఆడి 800 వికెట్లు తీసిన 47 ఏళ్ల మురళీధరన్‌ 2011 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌తో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 



సంబంధిత చిత్రం

Tags: muttiah muralitharan governor srilanka

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top