logo

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల


28-Nov-2019 06:51IST
release of jobs notification in powergrid corporation

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీలో గల ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబందించిన దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 15న  powergridindia.com వెబ్‌సైట్‌లో ప్రారంభం కానుంది. ఇట్టి దరఖాస్తు 2020 ఫిబ్రవరి 15 తేదీన ముగియనుంది. ఈ పోస్టులను గేట్ 2020 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఈ పోస్టులకు సంబందించిన ఖాళీల వివరాలను డీటెయిల్ట్ నోటిఫికేషన్‌లో వెల్లడించనుంది పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. 2020 జనవరి 10న పూర్తి వివరాలతో నోటిఫికేషన్ విడుదల కానుంది.

నోటిఫికేషన్ వివరాలు:

భర్తీ చేయనున్న పోస్టులు- ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 15
విద్యార్హత- బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ కోర్సు చేయాలి. గేట్ 2020 స్కోర్ ఉండాలి.
వయస్సు- 28 ఏళ్ల లోపు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
ఫీజు- జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు లేదు.

PGCIL కోసం చిత్ర ఫలితం

Tags: jobs notification powergrid corporation executive trainee

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top