logo

ఐదవ రోజు కూడా కిందకు దిగిరాని పెట్రోల్ ధరలు


28-Nov-2019 07:16IST
even on the fifth day also no downward petrol prices

రోజురోజుకు పెట్రోల్ ధరలు అగ్ని జ్వాలలుగా పైకి ఎగసి పడుతున్నాయి. దేశంలో వరుసగా ఐదో రోజూ కూడా కిందకు దిగిరాని పెట్రోల్‌ ధరలు చూస్తుంటే సామాన్యుడు తమ వాహనాలను బయటకు తియ్యాలంటే భయపడుతున్నారు.  పైసా.. పైసా పెరుగుతూ రూపాయలకు చేరి వినియోగదారులకు తేరుకోలేని షాక్‌ ఇస్తున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 56 పైసలు పెరిగగా, ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80 మార్కును దాటింది. ఈ లెక్కన లీటర్‌ పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.74.76గా, కోల్‌కతాలో రూ.77.44గా, ముంబయిలో రూ.80.42గా, చెన్నైలో రూ.77.72గా కొనసాగుతున్నాయి. 

ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 11 పైసలు పెరిగి రూ.79.56గా నమోదు అయ్యింది. మరోపక్క క్రూడాయిల్‌ ధరల్లో పెరుగుదల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్‌ ధరలు ఒక ఏడాది గరిష్టానికి చేరుకున్నాయి. దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్‌ ధర ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సమ్మె కారణంగా రవాణా చార్జీలు పెరిగాయి దాని ప్రభావం పరోక్షంగా పేద మధ్య తరగతి ప్రజలపై పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత చిత్రం

Tags: fifth day increasing petrol prices

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top