logo

35 వేల దిశగా పతనం అవుతున్న పసిడి ధరలు


28-Nov-2019 07:28IST
gold prices falling towards 35 thousand

పసిడి ప్రియులకు శుభవార్త..! ఇటీవలే కాలంలో సామాన్యులకు అందనంత దూరానికి వెళ్లిన పసిడి ధరలు నేడు కిందకు దిగి వచ్చాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గు ముఖం పట్టడంతో పసిడి ప్రియులకు నేడు శుభవార్తగా నిలిచింది. తులం బంగారం 35 వేల దిశగా పతనం అవుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో నేడు బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయిల తగ్గుదలతో  39,410 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 120 రూపాయిల తగ్గుదలతో 36,130 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 100 రూపాయిలు తగ్గుదలతో 46,300 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గిపోవడంతో పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి.అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి తగ్గుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. వాల్‌స్ట్రీట్‌ సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేయడం కూడా బంగారం పెట్టుబడులకు దూరం చేసింది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి తగ్గుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. వాల్‌స్ట్రీట్‌ సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేయడం కూడా ఇన్వెస్టర్లను బంగారం పెట్టుబడులకు దూరం చేసింది రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 



సంబంధిత చిత్రం

Tags: gold prices falling towards 35 thousand business news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top