logo

నోరూరించే జొన్నలడ్డు


28-Nov-2019 07:57IST
tasty jonnaladdu

జొన్నలను ఆహారంగా తీసుకోవడం ఈ మధ్యకాలంలో చాలా తగ్గించేశారు. కానీ.. వీటిలో ఉండే పోషకాల చిట్టా తెలుసుకుంటే.. మళ్లీ తినకుండా ఉండలేరు. జొన్నల్లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటానికి తోడ్పడతాయి. కాబట్టి అన్ని ధాన్యాల కంటే.. జొన్నలే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. అలాంటి జొన్నలతో లడ్డులను చేసుకుంటే రుచికి రుచి పోషకాలకు పోషకాలు. మరీ ఈ జొన్న లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..! 

కావలసిన పదార్థాలు: జొన్నపిండి - 1 కప్పు, పంచదార - 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి - అరకప్పు, యాలకులు - 3, గోరువెచ్చని పాలు - 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - 2 టీ స్పూన్లు.

తయారుచేసే విధానం: చిన్నమంటపై జొన్నపిండిని నెయ్యిలో దోరగా వేగించి పూర్తిగా చల్లారనివ్వాలి. పంచదారలో పొట్టు తీసిన యాలకులు వేసి మెత్తగా గ్రైండు చేయాలి. జొన్నపిండి, పంచదార బాగా కలిపి గోరువెచ్చని పాలు చల్లి వెంటవెంటనే లడ్డూలను చుట్టాలి. రుచిలో శనగపిండి లడ్డూలకు ఏమాత్రం తీసిపోవు. దీన్ని ఇలా చేసుకుని తింటే జొన్నలను ఇస్పదని వాళ్ళు కూడా దీన్నే ఇకపై ఇష్టంగా తింటారు. మరింకెందుకు ఆలస్యం ట్రై చెయ్యండి. 
image-1559240214357

Tags: tasty jonnaladdu homely based

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top