logo

చిన్న వయసులోనే పెద్ద వారిలా కనిపిస్తున్నారా..?


30-Nov-2019 09:05IST
weight loss tips in telugu

సాధారణంగా మనం రోజు తీసుకునే భారీ క్యాలరీల ఆహరం కారణంగా అధిక బరువు, ఊబకాయం, పొట్ట చుట్టూ కొవ్వు, చర్మమూ జుట్టూ కాంతి హీనంగా మారడం, జుట్టు పలచబారడం... తదితర సమస్యలతో మనం ఉన్న వయసు కన్నా ఎక్కువ వయసు కనిపిస్తూ ఉంటుంది. మన శరీర బరువును, అందాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామంతో కూడిన జీవనశైలి  చాలా ముఖ్యం.
 
Related image
శరీర బరువును అదుపులో ఉంచుకోవాలంటే ఏం చెయ్యాలి..? 

మన శరీర బరువుని గుర్తు చేసే పొట్టతగ్గాలంటే పిండిపదార్థాలు, తీపిపదార్థాలు మితంగా తీసుకోవాలి, వేపుళ్లు, జంక్‌ ఫుడ్‌, బేకరీ ఐటమ్స్‌, కూల్‌ డ్రింక్స్‌ మానుకోవాలి. భోజనంలో అన్నం కంటే, కూరలు, పప్పు, పెరుగు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఉప్పు అధికంగా ఉండే ఊరగాయలు, పచ్చళ్ళు బాగా తగ్గించాలి. మీ వయసుకు, జీవనశైలికి అవసరమైనన్ని కెలోరీలు మాత్రమే లభించే ఆహారం తీసుకోవాలి. భోజనానికి ముందు తప్పనిసరిగా ఒక కప్పు సలాడ్‌ (పచ్చి కూరగాయ ముక్కలు) తీసుకోవాలి.

 యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండే జామ, దానిమ్మ, కమలా, ఆపిల్‌, పుచ్చ, బొప్పాయి మొదలైన ఫలాలను తినడం వల్ల చర్మం తిరిగి మెరుపును సంతరించుకుంటుంది. ప్రొటీన్లు, ఖనిజాలు అధికంగా ఉండే బాదం, ఆక్రోటు, పిస్తా వంటి పప్పులు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రశాంతమైన నిద్ర, మానసిక ఆందోళన తగ్గించుకోవడం వల్ల కూడా వయసుకు తగ్గట్టు శరీరం కనిపిస్తుంది. మద్యపానం, ధూమపానంలాంటి అలవాట్లు అకాల వృద్ధాప్యాన్ని, అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి.

Tags: weight loss Weight loss story health tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top