logo

బలమైన కురుల కోసం ఈ జాగ్రత్తలు పాటించండి..?


30-Nov-2019 09:07IST
for healthy hair use this tips

సాధారణంగా చాలా మంది పడుతున్న సమస్యల్లో జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంటుంది. వాతావరం కారణంగా, లేక మనం ఉండే పరిసరాల్లో నీళ్లు మారడం వలన, ఆహార లోపం, ఒత్తిడి లాంటి కారణాలు మన జుట్టు రాలేందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని చిన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా ఈ సమస్య నుండి మనం కాస్త ఉపశమనం పొండమే కాకుండా.. బలమైన కురులని మన సొంతం చేసుకోవచ్చు. అదేలాగంటే...?
షాంపూ: వెంట్రుకలకు హాని చేయని షాంపూనే ఉపయోగించాలి. ఇలాచేస్తే షాంపులలో వాడే కెమికల్స్ వెంట్రుకల దృఢత్వాన్ని కోల్పోనివ్వకుండా చేస్తాయి. 

Image result for బలమైన కురుల కోసం ఈ జాగ్రత్తలు పాటించండి..?

కండీషనర్‌: కేశాలకు కండీషనింగ్‌ చేయాలనుకున్నప్పుడు కొసలకు మాత్రమే కండీషనర్‌ రుద్దుకోవాలి. కురుల చివరన హెయిర్‌ సీరం రుద్దుకుంటే వెంట్రుకలు చిక్కుపడవు.

బ్లో డ్రైయర్‌: తలస్నానం చేశాక శిరోజాలను డ్రైయర్‌తో ఆరబెట్టుకోవాలి. వెంట్రుకలు పూర్తిగా ఆరిన తర్వాతే జడ వేసుకోవాలి. లేకుంటే తడి జుట్టు వలన చిక్కులు పడి జుట్టు రాలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

బ్యాక్‌ కోంబింగ్‌: జుట్టు నిండుగా పెరిగేందుకు బ్యాంక్‌ కోంబింగ్‌ తోడ్పడుతుంది. కొసల నుంచి మాడు వరకు దువ్వడం వల్ల వెంట్రుకలు బలంగా మారతాయి. జుట్టు రాలిపోవడం తగ్గుతుంది.

Tags: healthy hair tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top