logo

ప్రియాంక రెడ్డి హత్యాచారం.. ఎంత దారుణం అసలు!


30-Nov-2019 10:40IST
priyanka reddy murder case in hyderabad

డాక్టర్ ప్రియాంక రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ ప్రియాంక రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి చెటాన్‌పల్లి బైపాస్‌ రోడ్డు అండర్‌ బ్రిడ్జి కింద పెట్రోలు పోసి సజీవదహనం చేశారు. దీంతో ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేవలం 24 గంటల్లో ప్రియాంక రెడ్డి హత్య కేసును ఛేదించారు. బుధవారం రాత్రి 9:45 నిమిషాలకు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వగా 10 :15కు ఆమె మృతి చెందింది.  

Image result for priyanka reddy

అయితే ప్రియాంక రెడ్డిపై నలుగురు లారీ డ్రైవర్, క్లీనర్లు కలిసి ఆమెపై హత్యాచారం చేసినట్టుగా నిర్దారించారు. ఉద్దేశపూర్వకంగానే ప్రియాంక రెడ్డితో టైర్ పంక్చర్ డ్రామా ఆడినట్టు పోలీసులు గుర్తించారు. మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి నలుగురు కలిసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారని పోలీసులు తేల్చి చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. 

Image result for priyanka reddy

హత్యానంతరం మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి కిరోసిన్ పోసి తగలబెట్టారు ఆ తర్వాత మృతదేహాన్ని అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లి అక్కడ పడేశారు.  మరో నిందితుడు స్కూటీని అక్కడికే తీసుకొచ్చి పార్క్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం నలుగురు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. అయితే ఢిల్లీలో నిర్భయ ఘటన హైదరాబాద్ లో ప్రియాంక రెండు దారుణం ఒక్కటే. ఈ ఘటనలపై రాజకీయనాయకుల నుండి సినిమా స్టార్ల వరుకు ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు. 

Read latest Crime News  and Telugu News   Follow us on FacebookTwitter 

Tags: priyanka reddy murder case hyderabad RIP Priyankareddy crime news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top