logo

డిసెంబ‌రు 7న భారీస్థాయిలో గీతాజ‌యంతి


30-Nov-2019 12:51IST
geeta jayanti on dec 7th

భ‌గ‌వ‌ద్గీత ప్రాశ‌స్త్యాన్ని నేటి విద్యార్థుల‌కు తెలియ‌జేసేందుకు డిసెంబ‌రు 7న 10 వేల మంది విద్యార్థుల‌తో గీతాజ‌యంతి ఉత్స‌వాన్ని తిరుప‌తిలో భారీస్థాయిలో నిర్వ‌హిస్తామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. 

తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో  టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశంలో పాల్గొన్న  ఛైర్మ‌న్ మాట్లాడుతూ  స‌నాత‌న ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా 6వ త‌ర‌గ‌తి నుండి ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థుల్లో ఒత్తిడి నివార‌ణ‌కు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించి వ్య‌క్తిత్వ వికాస నిపుణుల‌తో ఉప‌న్యాసాలు, స‌ర‌స్వ‌తి కంక‌ణాలు పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. త్వ‌ర‌లో విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌లో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని, వ‌చ్చే ఏడాది తెలుగు రాష్ట్రాల‌కు విస్త‌రిస్తామ‌ని వెల్ల‌డించారు.

 దాస సాహిత్యాన్ని విస్తృతంగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లో జాతీయ స‌ద‌స్సు నిర్వ‌హిస్తామ‌న్నారు. గురువుల ప్రాముఖ్య‌త‌ను తెలిపేలా గురుపూజోత్స‌వాన్ని చేప‌డ‌తామ‌ని చెప్పారు. నిరుప‌యోగంగా ఉన్న టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల‌ను గుర్తించి వాటిని అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకొస్తామ‌న్నారు. స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారానికి కృషి చేస్తున్న ప‌లు ఆధ్యాత్మిక సంస్థ‌ల‌కు ఆర్థిక సాయం అందిస్తామ‌ని తెలిపారు.

Tags: geeta jayanti lord vishnu margasira masam ttd chairman subbareddy

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top