logo

జన్యుసంబంధిత వ్యాధులకు కాఫీతో చెక్‌


30-Nov-2019 14:41IST
check with coffee for genetic diseases

చాలా మంది కాఫీని పరిమితికి మించి తాగితే లేనిపోని రోగాలొస్తుంటాయ్ అని జ‌నాల‌నే తెగ భ‌య‌పెట్టేస్తుంటారు. ప్ర‌కృతి వైద్యం మాటున అది తాగకూడదు, ఇది తిన‌కూడ‌దు, మేక‌ల్లా ఆకులూ అల‌మ‌లేంటి, క్రూర జంతువుల్లా ఈ మాంసాహారం వ‌స్తుంది. అన్నం తింటే ఆంబం, పప్పు తింటే పైత్యం అని నోటి ద‌గ్గ‌ర కూడు లాగేయ‌టం నిత్య‌కృత్య‌మై వినిపిస్తుంటుంది. అయితే ఏదైనా స‌రే మితంగా ఉన్నంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. లేకుంటేనే ఆరోగ్య సమస్యలు వస్తాయంటారు మ‌న పెద్ద‌లు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే తరుచుగా కాఫీ తాగడం వలన  జన్యపరమైన వ్యాధి నయమైందంటున్నారు  హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ పరిశోధకులు.  

 బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఐదేళ్లుగా జన్యుసంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు.  అత‌ని ప్రమేయం లేకుండానే రోజులో 10 నుంచి 15 సార్లు అవయవాలతోపాటు అతని ముఖములో క‌ద‌లిక‌లు వ‌చ్చేసేవి. మందుల‌నే కం వాడినా ఫ‌లితంశూన్యం.

ఈ క్ర‌మంలోనే  తన మిత్రుడి వ్యాధి గురించి హైదరాబాద్‌లో సీడీఎఫ్ డీలో పని చేసే ఉద్యోగి అశ్విన్ దలాల్ కు  తెలిసింది.  బెంగళూరులో ఉంటున్న త‌న మిత్రుడి ద‌గ్గ‌ర‌కి వెళ్లి అనేక వైద్య‌ పరీక్షలు చేయించాడు.  వీటిలో అతనికి అడినిలైటెడ్ సైక్లేస్ వ్యాధి ఉన్నట్లు తేలింది. 

దీంతో ఈ వ్యాధి నివార‌ణ‌పై అనేక పుస్త‌కాలు చ‌దివాడు, అనేక మందిని సంప్ర‌దించాడు. ఓ పుస్త‌కంలో ఫ్రాన్స్‌లో ఒకతనికి ఇటువంటి వ్యాధే ఉండేదని..అతినికి కాఫీ తాగించడం ద్వారా ప్రాబ్లమ్ పోయిందని అశ్విన్ చ‌దివాడు. త‌నతో పాటు సీడీఎఫ్ డీలో పని చేసే శాస్త్ర‌వేత్త‌ల‌ని సంప్ర‌దించి ప‌రిస్థితి వివ‌రించాడు.

అంతే జన్యువ్యాధి గ్రస్తుడైన త‌న మిత్రునిపై కాఫీ థెర‌ఫీ ప్రయోగించడం ఆరంభించారు.   3 నెలలుపాటు రోజూ 3 సార్లు కాఫీ తాగడంతో అతని క్ర‌మ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టి ఇప్పుడు ఆ వ్యాధి పూర్తిగా నయ‌మై పోయింది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను మీడియాకు వివ‌రించిన అశ్విన్  జన్యుసంబంధిత వ్యాధులకు చికిత్స ఉండదని..నివారణ ఒక్కటే మార్గమని చెప్పారు. 


Tags: coffee therapy genetic diseases health benifits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top