logo

నష్టాల బాటలో బిగ్ బాస్కెట్


30-Nov-2019 20:28IST
big basket company running in huge loss

భారత దేశంలోనే అతి తక్కువ సమయంలో మార్కెటింగ్ రంగంలో అత్యంత వేగంగా దూసుకుపోయిన బిగ్‌ బాస్కెట్‌ సంస్థ ఇప్పుడు నష్టాల బాట పట్టింది. ఈ సంస్థను నిర్వహించే ఇన్నోవేటివ్‌ రిటైల్‌ కాన్సెప్ట్స్ కంపెనీ నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో మరింత దిగజారాయి. ఈ క్రమంలో 2017–18లో రూ.179 కోట్లు ఈ కంపెనీ నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.348 కోట్లకు పెరిగాయి. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.1,410 కోట్ల నుంచి 69 శాతం వృద్ధితో రూ.2,381 కోట్లకు పెరిగింది. ఇన్నోవేటివ్‌ రిటైల్‌ కాన్సెప్ట్స్ సంస్థ బిగ్‌ బాస్కెట్‌నే కాకుండా ‘సూపర్‌మార్కెట్‌ గ్రోసరీ సప్లైస్‌’ పేరుతో హోల్‌సేల్‌  విభాగాన్ని కూడా నిర్వహిస్తోంది.  ఆర్థిక ఫలితాల వివరాలను ఇన్నోవేటివ్‌ రిటైల్‌ కాన్సెప్ట్స్ సంస్థ కేంద్ర కంపెనీల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఇటివలె కాలంలోనే సమర్పించింది.

big basket photos కోసం చిత్ర ఫలితం

Tags: big basket running huge loss

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top