logo

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం


02-Dec-2019 07:58IST
sri padmavathi ammavar panchami theertham is vibrant

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని పట్టపుదేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం పంచమీ తీర్థం (చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య రంగరంగ వైభవంగా జరిగింది.

ఉదయం 6.30 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి  ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీ తీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. పంచమీ తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కిలో 300 గ్రాములు బ‌రువుగ‌ల వ‌జ్రాలు పొదిగిన అష్ట‌ల‌క్ష్మీ స్వ‌ర్ణ వ‌డ్డాణాన్నిసారెతో పాటు తిరుప‌తి పుర‌వీధుల‌లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.

Tags: sri padmavathi ammavaru ttd tiruchanuru panchami theertham

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top