గుంటూరు లో సోమవారం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్ర చికిత్స అనంతరం రోగులకు విశ్రాంతి సమయంలో ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సహాయం పథకాన్ని ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గుంటూరుకు సీఎం జగన్ బయలుదేరతారని.. అనంతరం సర్వజన వైద్యశాలలో ఉదయం 11:20 గంటలకు ముఖ్యమంత్రి రోగులకు చెక్కులు అందించనున్నారని తెలిపింది. చెక్కుల పంపిణీ అనంతరం 11:40 గంటలకు గుంటూరు మెడికల్ కళాశాల జింఖానా ఆడిటోరియానికి చేరుకుని పథకం ప్రారంభానికి సంబంధించిన విషయాలపై ప్రసంగించనున్నట్లు పేర్కొంది. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారని వివరించింది.