logo

విజయారెడ్డి అటెండర్ చంద్రయ్య మృతి


02-Dec-2019 11:31IST
vijayareddy attender chandraiah died

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తహశీల్ధార్ విజయారెడ్డి హత్యా కేసులో అటెండర్ చంద్రయ్య చనిపోయాడు. గత 28 రోజులుగా ఆస్పత్రి బర్నింగ్ వార్డులో చికిత్సపొందుతున్న చంద్రయ్య ఆరోగ్యం ఆదివారం కాస్త విషమించింది. చంద్రయ్య ఆరోగ్య పరిస్థితిని గమనించిన డాక్టర్లు.. ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌‌పై చికిత్స చేశారు. సోమవారం ఉదయానికి ఆరోగ్యం క్షీణించడంతో చంద్రయ్య మృతి చెందాడు. గత నెల 3న విజయారెడ్డి పై పెట్రోల్ పోసి సురేష్ అనే వ్యక్తి నిప్పు పెట్టాడు. 

Image result for vijaya reddy

మంటల్లో చిక్కుకున్న విజయా రెడ్డి గట్టిగా కేకలు వేయడంతో ఆమెను కాపాడేందుకు చంద్రయ్య, గుర్నాథం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఆమెను కాపాడేందుకు వారు ప్రయత్నించే క్రమంలో వారికి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో విజయారెడ్డితో పాటు సురేష్, డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య మృతి చెందారు. చంద్రయ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. 

Read latest Crime News  and Telugu News   Follow us on FacebookTwitter 

Tags: vijayareddy attender chandraiah died telangana crime news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top