logo

అయ్యప్ప పూజలతో మారుమ్రోగుతున్న మ‌హా నగరం


02-Dec-2019 13:33IST
ayyappa is a grear hyderabad city with a lot of worship

కార్తీకమాసంలో మాలధారణకు శ్రీకారం చుట్టిన అయ్యప్ప భక్తులు నవంబర్‌ చివరివారంలో లక్షలాదిమంది భక్తులు మాలధారణ చేసారు. అత్యంత కఠినతరమైన నిబంధనలు, స్వల్పఆహారనియమాలను పాటిస్తున్న భక్తులు  రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంతో పాటు ప‌రిస‌ర జిల్లాలైన‌ రంగారెడ్డి, మెదక్‌, మెడ్చేల్‌-మల్కాజిగిరి జిల్లాలో శనివారం, ఆదివారం అయ్యప్ప మహా పడి పూజలు జోరుగా నిర్వహించారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ ప‌డి పూజ‌ల‌లో మండలదీక్షలు, జ్యోతిదీక్షలు చేపట్టిన భక్తులు పాల్గొంటున్నారు. 

ఇక తెలుగురాష్ట్రాల‌లో అయ్య‌ప్ప ఆల‌యాలు శ‌ర‌ణు ఘోష‌ల‌తో, అయ్యప్ప భక్తి గీతాలతో నగరం మారుమ్రోగుతున్నాయి. మ‌రోవైపు మండ‌ల దీక్ష‌లు పూర్త‌యిన‌ అయ్య‌ప్ప‌లు ఇరు ముడులు క‌ట్టించుకునేందుకు బారులు తీసుతున్నారు. గురుస్వాముల ఆశీస్సుల‌తో త‌మ ప్ర‌యాణాలు సాగించేందుకు అయ్య‌ప్ప‌లు సిద్ద‌మ‌వుతుంటే మ‌రోవైపు జ్యోతి దీక్ష‌ల కోసం మాలాధ‌ర‌ణ చేస్తున్న అయ్య‌ప్ప‌లు మ‌రికొంద‌రు వ‌స్తుండ‌టంతో ఇరు తెలుగు రాష్ట్రాల‌లో ల‌క్ష‌లాది మంది అయ్య‌ప్ప దుస్తుల‌తో క‌నిపిస్తున్నారు. 

కాగా అటు శ‌బ‌రిమ‌ల‌లోనూ అయ్య‌ప్ప‌ద‌ర్శ‌నానికి పెద్ద ఎత్తున అయ్య‌ప్ప ద‌ర్శ‌నార్ధం త‌ర‌లి వ‌స్తుండ‌టంతో శ‌బ‌రిమ‌ల కిట‌కిట‌లాడుతోంది. 

Tags: ayyappa grear hyderabad sabarimala saranam hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top