logo

చదువులతో పాటు క్రీడలూ అవ‌స‌ర‌మే


02-Dec-2019 13:56IST
sports are essential with education

తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని రాజేంద్రనగర్‌ నియోజకవర్గం శాసన సభ్యులు టి.ప్రకాష్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని స్పోర్ట్స్‌ కంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కేటింగ్‌ గ్రౌండ్‌ను ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న  క్రీడాకారులను పరిచయం చేసుకొని అభినందనలు తెలిపారు.

అనంతరం ఆయ‌న  ప్రతి ఒక్కరూ చదువులతో పాటు క్రీడలపై సైతం దృష్టి సారించాలన్నారు. దేశంలో, రాష్ట్రంలో క్రీడాకారులను ప్రభుత్వం డబ్బులు వెచ్చించి ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి నియోజ కవర్గంలో క్రీడాకారుల సౌకర్యార్థం గ్రౌండ్‌లను ఏర్పాటు చేయడం జరిగిం దన్నారు. అంతేకాకుండా క్రీడా సామాగ్రిని సైతం అందిస్తున్నట్లు తెలి పారు. 

మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారు ఢ్యాన్ని క్రీడలు వల్ల సాధ్యమౌ తాయన్నారు. రాజేంద్రనగర్‌లో ఉన్న క్రీడాకారులకు ఏ అవసరం వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అ వసరమైతే ప్రభుత్వంతో చర్చించి వారికి అవసరమయ్యే క్రీడా వసతులను కల్పించేందుకు కృషి చేస్తానని వివరించారు. తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు సైతం క్రీడా కారులను ప్రోత్సహించాలని కోరారు. 


Tags: sports are essential with education

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top