logo

పల్లీలు తింటే ఆలోచనాశక్తి పెరుగుతుంది


02-Dec-2019 14:14IST
eating palli nuts increases thinking ability

వేరుశనగ పప్పులు.. వీటినే పల్లీలు అని కూడా అంటారు. వీటిని తింటే లావు పెరిగిపోతారని, కొవ్వు పేరుకుపోతుందని, గుండె జబ్బులు వస్తాయని చాలా మంది అపోహ ప‌డుతుండ‌టం క‌ద్దు. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదు. వీటిని తింటే పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పల్లీలను తినడం వలన ఆలోచనాశక్తి పెరుగుతుంది. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. పల్లీల్లో ప్రొటీన్‌లు పుష్కలంగా లభిస్తాయి. అవి ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. ప్రతిరోజూ 30 గ్రాముల పల్లీలు తీసుకున్నట్లయితే గుండె సంబంధిత వ్యాధులు రావని వైద్యులు, శాస్త్రవేత్తలు అంటున్నారు.

వీటిని ఉడకబెట్టి తినడం, వేయించుకుని తినడం లేదా పచ్చడి, కూరలు చేసుకుని తినడం ఇలాగ ఎలా అయినా తీసుకోవచ్చు. బెండకాయ ఫ్రైలో పల్లీలు, దొండకాయ ఫ్రైలో పల్లీలు, అంతేకాదు పల్లీలలో రకరకాల స్వీట్లు తయారు చేసుకుని తింటుంటారు. 


Tags: eating palli nuts increases thinking ability health benefits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top