logo

"సెల్లమ్మె భూతం" లఘు చిత్రం విడుద‌ల‌


02-Dec-2019 14:36IST
saleemmo bhutam   short film released

ఇటీవ‌ల కాలంలో సెల్ ఫోన్ మ‌నిషి జీవితంలో భాగంగా మారిపోయింది. పెరుగుతున్న సాంకేతిక‌తతో ఎన్ని లాభాలు పొందుతున్నాడో, అంత‌కు మించిన న‌ష్టాలూ చ‌వి చూస్తున్నాడు. సామాజిక మీడియా వ‌చ్చాక ఆ ప్ర‌భావం ప్ర‌తివ్య‌క్తినీ క‌బ‌లిస్తోంది. ఉప‌యోగం క‌న్నా, దుర్వినియోగ‌మే జ‌రుగుతోంది. టిక్‌టాక్‌లాంటి యాప్‌ల‌ వ్య‌స‌నాల‌కు బానిస‌లైపోతున్నారు. ఇదే అంశాల‌పై జ‌న‌ జాగృతం చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ జానపట్ల మారుతి స్వామి  "సెల్లమ్మె భూతం" లఘు చిత్రాన్నినిర్మించారు.

మరో సీనియర్ జర్నలిస్ట్ నేత అయిలు రమేష్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రాన్నిటియూడబ్ల్యూజె రాష్ర్ట అద్యక్షులు నగునూరి శేఖర్ సోమవారం జ‌రిగిన ఓ మీడియా స‌మావేశంలో విడుదల చేసారు. ఈ సందర్బంగా శేఖ‌ర్  మాట్లాడుతూ సెల్ ఫోన్ మానవ జీవితంలో ఎలాంటి దుష్పప్రభాన్ని చూపిస్తుందో చక్కగా వివరించేలా రూపొందించిన ఈ సినిమా అన్నివ‌ర్గాలూ ఆద‌రించేలా ఉంద‌ని అన్నారు. టెక్నాలజీ ని మానవాళి మంచికి ఉపయోగించాల్సింది పోయి, చెడు మార్గాల‌వైపు ప‌య‌నించ‌డం ఆందోళ‌న క‌ర‌మ‌న్నారు. సెల్‌ఫోన్ వినియోగంలో అతి పనికి రాదని ఈ చిత్రం యూనిట్ అందించిన సందేశంతో కొంతైనా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. 

Tags: saleemmo bhutam short film released sr. journalist

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top