logo

ఆర్థమెటిక్‌‌తో అపారమైన అవకాశాలు సొంతం


02-Dec-2019 15:11IST
there are enormous possibilities with Arithmetic

ఆర్థమెటిక్‌‌ (అంకగణితం)తో అన్ని రంగాల్లోనూ అపారమైన అవకాశాలను సొంతం చేసుకొని ఉన్నతశిఖరాలు అధిరోమించవచ్చని సిప్‌ అబాకస్‌ అకాడమీ రీజనల్‌ మేనేజర్‌ ఉమాస్వామినాథన్‌ అన్నారు. సిప్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆల్‌ ఇండియా ఆర్థమెటిక్‌ జీనియస్‌ కాంటెస్టు-2019లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి పోటీలను హైద‌రాబాద్‌లోని ఉప్పల్‌ లిటిల్‌ ఫ్లవర్‌ కాలేజీ ఆడిటోరియంలో  జ‌రిగింది.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారి విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు, గణితంపై ఉన్న భయాన్ని పోగొట్టి ఆత్మస్థైర్యాన్ని కల్పించేందుకు ఆర్థమెటిక్‌ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నేటి విద్యా వ్యవస్థలో ఆర్థమెటిక్‌‌స కీలకపాత్ర పోషిస్తుందని, ఉన్నత చదువులతో పాటు పలు రంగాల్లో కీలకమైన పదవులు, ఉద్యోగాలను చేపట్టేందుకు ఆర్థమెటిక్‌ ఎంతో ఉపయోక్తంగా ఉంటుందని వివరించారు 

ఈ సందర్భంగా  నిర్వ‌హించిన పోటీల‌లో విజేత‌ల‌కు  బహుమతులు అంద‌జేసారు. పల్లవి అవేర్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు ప్రిన్సిపాల్‌ శ్యామల ముఖ్య అతిథిగా హాజరై విజేతలతో పాటు మరో 60 మంది విద్యార్థులకు క్యాష్‌ ప్రైజ్‌లతో పాటు ప్రోత్సాహక బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు. రాష్ట్ర స్థాయిలో పోటీల్లో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన సుమారు వెయ్యి మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.

Read latest National News and Telugu News |Follow us on FacebookTwitter 

Tags: enormous possibilitie arithmetic uma somanatham

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top