logo

చీమ - ప్రేమ మధ్యలో భామ! ఆడియో లాంచ్‌


02-Dec-2019 15:26IST
chimaprema madhyalo bhama audio lanch

ఈ సృష్టి అత్యంత అల్ప ప్రాణి అయిన చీమ మనిషిగా మారాలని మనసు పడుతుంది!   మరి అది సాధ్యమైందా లేదా దానికి ప్రేమ, శృంగారం తోడైతే… అది ఎలా ఉంటుంద‌న్న ఊహ‌ల‌కు ప్ర‌తిరూపంగా  మాగ్నమ్ ఓపస్  ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు దర్శకత్వం లో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో భామ !”.

అమిత్ , ఇందు హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, ఇత‌ర సాంకేతిక ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ చిత్ర‌ ఆడియోని ఫిలింఛాంబ‌ర్‌లో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 

ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో... దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు మాట్లాడుతూ ” మా సినిమాకి చీమే క‌థ‌. జ‌గ‌మంతా రామ‌మ‌యం మా సినిమా అంతా చీమ మ‌యం. చీమ – ప్రేమ మధ్యలో భామ!”  గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ సినిమాలోని పాట‌లు అన్నీ చాలా బాగా వ‌చ్చాయి. ఇక్క‌డ‌కి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

నిర్మాత ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ” మా చిత్రం గ్రాఫిక్స్ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాని ఖర్చుకి వెనకాడకుండా కొత్తవాళ్లతో నిర్మించాము. రవి వర్మ  అందించిన సంగీతం మరియు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం, గీతా మాధురి  పాడిన పాటలు చాలా బాగున్నాయి. మంచి సంగీతంతో పాటు సాహిత్యాన్ని కూడా ఉన్నాయ‌ని చెప్పారు.

Tags: chima-prema madhyalo bhama audio lanch sp balasubrahmanyam geeta madhuri

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top