logo

`భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు` ప్రీ రిలీజ్


02-Dec-2019 15:34IST
bhagyanagara veedhulalo pre release

శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. డిసెంబ‌ర్ 6న విడుద‌ల సినిమాను విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా అనిల్ రావిపూడి, ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ పాల్గొన్నారు. బ్యాన‌ర్ లోగోను అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. టైటిల్ యానిమేష‌న్‌ను ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ విడుద‌ల చేశారు.  ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్న విష‌యం విదిత‌మే. 

ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చిన్న కాన్సెప్ట్‌గా ఆరంభించిన ఈ సినిమాకు నిర్మాత‌గా మాత్ర‌మే ఉందామ‌నుకున్నా, ద‌ర్శ‌కుడిగా వేరొక‌రిని పెట్టినా  ఏమైందంటూ నేను నిల‌బ‌డాల్సి వ‌స్తుందనే ద‌ర్శ‌కుడిగా అవ‌తారం ఎత్తాను. ఇలా ద‌ర్శ‌కుడు కావాల‌నే నా కోరిక అలా తీరిందన్నారు. ఈ  సినిమా చూసిన దిల్‌రాజు , శిరీష్ , సాయి ఇలా ప‌లువురు చేసిన సూచ‌న‌లతో మేం చేసిన త‌ప్పులు స‌రిదిద్దుకోవ‌టంతో  సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది. జౌట్ అండ్ ఔట్ కామెడీ. 1గంట 53 నిమిషాలున్న మా సినిమాలో గంట‌న్న‌ర సేపు ప‌డి ప‌డి న‌వ్వుతారు. ఆ విష‌యంలో నాది గ్యారెంటీ. నో యాక్ష‌న్‌, నో సెంటిమెంట్ .. ఓన్లీ కామెడీ సినిమాను డిసెంబ‌ర్ 6న విడుద‌ల చేస్తున్నామ‌ని చెప్పారు.  

Read latest Movies News and Telugu News  Follow us on FacebookTwitter 
 

Tags: bhagyanagara veedhulalo pre release srinivasa reddy satya shuklaka shankar

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top