logo

దిశ అత్యాచార ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్..


02-Dec-2019 16:02IST
revanth reddy fires on disha case

పోలీసుల వైఫల్యం వల్లే దిశ అత్యాచారానికి గురైందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన దిశ అత్యాచార ఘటనపై సోమవారం పార్లమెంట్ లో చర్చించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నవంబర్ 26వ తేదీన జరిగిన దిశ అత్యాచార ఘటన అత్యంత క్రూరమైనదని దిశ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని విమర్శించారు. 

Image result for disha case parliament revanth reddy

కొన్ని నెలల క్రితం భువనగిరి జిల్లా హాజీపూర్‌లో అత్యంత దారుణమైన సంఘటన జరిగిందని. ఇటువంటి ఘటనల్లో విచారణలు జరుగుతూనే ఉన్నాయని ఎంపీ మండిపడ్డారు. వరంగల్ లో తల్లి ఒడిలో ఉన్న తొమ్మిదినెలల పసిపాపను ఎత్తుకెళ్లి రేప్ చేసిన దుండగుడికి సెషన్స్ కోర్టు ఉరిశిక్ష తీర్పు ఇస్తే... హైకోర్టు జీవితకాలం శిక్ష మార్చుతూ తీర్పునిచ్చిందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags: revanth reddy fires disha case

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top