logo

డిసెంబర్ 20న “తొలికిరణం” విడుద‌ల‌


02-Dec-2019 16:20IST
tolikiramanam is released on december 20th

ఏవియమ్ ఆర్ట్ ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్ బేబీ మేరీ విజయ సమర్పించ‌గా, ఎమ్.ఆర్.సి నాయుడు నిర్మించిన‌ తొలికిరణం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమ‌వారం  హైదరాబాద్ లో జరిగింది.  ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా దర్శకుడు సాగర్, దర్శకుడు వేణు, భాను చందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు జాన్ బాబు మాట్లాడుతూ… ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన భాను చందర్ కి ధ‌న్యావాదాల‌న్నారు.  అలాగే  మాకు అన్ని విధాలా సహకరించి ప్రోత్సాహ‌మిచ్చిన ద‌ర్శ‌కుడు సాగ‌ర్‌కి  చిత్ర యూనిట్ త‌ర‌పున కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.  సినిమా కొంత  ఆలస్యం అయినప్పటికీ గొప్పగా వ‌చ్చింద‌ని, ప్రేక్ష‌కుల‌కు ఖ‌చ్చితంగా న‌చ్చేలా ఉంటుంద‌ని చెప్పారాయ‌. డిశంబ‌ర్ 20న సినిమా విడుద‌ల చేస్తున్న‌ట్టు వివ‌రించారు. 

దర్శకుడు సాగర్ మాట్లాడుతూ…  క్రిస్టమస్ సందర్బంగా  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. విజయ్ చందర్ కరుణామయుడు చిత్రం కంటే తొలికిరణం సక్సెస్  అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  చిత్ర యూనిట్ సభ్యులంద‌రికీ అభినంద‌న‌లు తెలిపారు.    

Tags: "tolikiramanam" released december 20th director sagar bhanuchandar john babu

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top