ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పై శ్రద్ద వహించాలని మాజీ పార్లమెంట్ సభ్యురాలు, సినీ నటి జయప్రద అన్నారు. అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ ఇండోక్రినాజీ డా. లక్ష్మీ లావణ్య ఆలపాటి ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవనగర్, గౌలిదొడ్డి లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జయప్రద మాట్లాడుతూ సమాజ సేవే ధ్యేయంగా అంతా పని చెయ్యాలని సూచించారు. మద్యానికి బానిస కాకుండా ఆరో గ్యాన్ని కాపాడుకోవాలని,.ప్రతి కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆర్థికంగా, సామాజికంగా బాగుంటుందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న . అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ ఇండోక్రినాజీ డా. లక్ష్మీ లావణ్య ఆలపాటి ని ఆమె అభినందించారు.
ఈ కార్యక్రమానికి సేవ భారత్,సంఘ్ పరివార్ కార్యకర్తలు తమ సహకారాన్ని అందించారు.