logo

పెరిగిన బస్సు ఛార్జీలు.. ఎంతంటే ?


02-Dec-2019 17:07IST
tsrtc charges was gain in telangana

తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం బస్సు ఛార్జీలు నుంచి పెంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా బస్సు ఛార్జీలను కిలోమీటరుకు 20 పైసలు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే  నిర్ణయం తీసుకోగా... దానికి సంబంధించి పూర్తి ఛార్జీల వివరాలను ప్రభుత్వం సోమవారం  ప్రకటించింది. గతంలో పల్లె వెలుగు బస్సుల్లో కనీస చార్జీ  8 రూపాయలుగా ఉండగా... వాటిని రూ.10కి పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్ కనీస చార్జీ రూ.15కు పెంచింది. ఇక డీలక్స్ బస్సుల్లో రూ.20 , సూపర్ డీలక్స్ బస్సుల్లో రూ.25, రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్ ఏసీ సర్వీసుల్లో రూ.35 లుగా కనీస చార్జీలను పెంచారు. కాగా సిటీలో ఉన్న టికెట్ చార్జీలన్నీ ప్రస్తుతం ఉన్న వాటిపై రూ.5 చొప్పున పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. 

Image result for పెరిగిన బస్సు ఛార్జీలు.. ఎంతంటే ?

సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జీ రూ.5 నుంచి పది రూపాయలకు పెంచింది . మెట్రో డీలక్స్ సర్వీసుల్లో రూ.10 నుంచి 15కు పెంచింది.  బస్ పాస్ ధరలను కూడా ఆర్టీసీ అమాంతంగా పెంచింది. సిటీ ఆర్డినరీ బస్ పాసుల ధరను రూ. 770 నుండి రూ. 950 కు మెట్రో పాస్ లను రూ.880 నుండి రూ.1070కు మెట్రో డీలక్స్ పాసు ధర ను రూ.990 నుండి రూ.1180 కు పెంచింది, ఇక స్టూడెంట్ పాస్ ధర గతంలో రూ.130 ఉండగా తాజాగా రూ.165 కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ బస్సు ఛార్జీల పెంపుతో మంగళవారం నుండి సామాన్య ప్రయాణికులపై తీవ్ర భారం పడనుంది.  

Tags: tsrtc charges telangana

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top