logo

విశాఖ‌లో న‌కిలీ నోట్ల క‌ల‌క‌లం


03-Dec-2019 01:26IST
fake dummy notes halchal in visakha

విశాఖలో నకిలీ కరెన్సీ మ‌రోమారు హ‌ల్‌చ‌ల్ చేసింది. సోమ‌వారం విశాఖ హెచ్‌బీ కాలనీకి చెందిన కేఎన్‌వీ సత్యనారాయణ, ఆర్‌.జయరాం, బి.పద్మారావులు  నకిలీ కరెన్సీ నోట్ల  మార్చేందుకు ప్రయత్నిస్తుండ‌గా   పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2,96,000 విలువ చేసే నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ అరెస్టుకు సంబంధించిన వివ‌రాల‌ను నగర సీపీ ఆర్‌.కె.మీనా మీడియాకు వివ‌రించారు. అత్యంత సాంకేతిక నైపుణ్యంతో ఈ నకిలీ కరెన్సీని ముద్రించి, 1:3 నిష్పత్తిలో ఈ దొంగనోట్లు సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఈ న‌కిలీ నోట్లు అస‌లువాటికి ధీటుగా ఉన్నాయ‌ని, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సయ్యద్‌ ముజిబుర్‌ రెహమాన్‌, విశాఖ జిల్లా చోడవరంకు చెందిన షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌లు దొంగనోట్లు సరఫరా చేస్తున్నట్లు  నిందితులందించిన స‌మాచారం మేర‌కు తెలిసింద‌ని,  ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. మ‌రోవైపు ఈ కరెన్సీని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని, ఇందుకోసం ఎన్‌ఐఏ సహకారం తీసుకుంటామని ఆయన చెప్పారు.

Tags: fake dummy notes visakhapatnam commissioner of police rk meena

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top