logo

కల్తీ మద్యం తాగి 11మంది మృతి


28-May-2019 12:38IST
11 killed in alcohol consumption

లక్నో: కల్తీ మద్యం తాగి 11మంది మృతి చెందిన సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరికొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఒకే దుకాణం నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బారాబంకి, రామ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాణిగంజ్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: 11 people die alcohol consumption uttarapradesh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top