logo

దిశ కేసుపై గ‌వ‌ర్న‌ర్‌ని క‌ల‌సిన మా ప్ర‌తినిధులు


05-Dec-2019 09:39IST
maa representatives who served as the governor of telangana on disa case

హైద‌రాబాద్ లో జ‌రిగిన దిశ అత్యాచారం, హ‌త్య‌ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈహ‌త్యోదంతంపై ప‌లువురు సినీ తారాలు కూడా త‌మ నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ సామాజిక మీడియాలో అనేక పోస్టులు పెట్టారు. ఆ ఘ‌ట‌న‌కు కార‌కులైన దోషులకు మ‌ర‌ణ‌దండ‌న విధించ‌డ‌మే స‌రైన నిర్ణ‌యంగా అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసారు. 

కాగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీ అసొసియేష‌న్ మా ఈ విష‌యంలో మ‌రోమంద‌డుగు వేసి దిశ హ‌త్య‌చారం లాంటి ఘ‌ట‌న‌లు తిరిగి పున‌రావృతం కాకుండా ఈ కేసుపై వేగంగా ద‌ర్యాప్తు జ‌రిపి తొంద‌ర‌గా దోషుల‌కు శిక్ష ప‌డేలా చేయాల‌ని కోరుతూ తెలంగాణ గ‌వ‌ర్నర్ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ని క‌ల్సింది.

గ‌వ‌ర్న‌ర్‌ని క‌ల‌సిన మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప్ర‌తినిధులలో`మా` జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జీవిత రాజ‌శేఖ‌ర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజ‌శేఖ‌ర్, ఉపాధ్య‌క్షురాలు హేమ‌, అనిత చౌద‌రి,జ‌య‌ల‌క్ష్మి త‌నీష్‌, సురేష్ కొండేటి, ఏడిద శ్రీ‌రామ్, ర‌వి ప్ర‌కాష్ త‌దిత‌రులు ఉన్నారు.

దిశ‌కు జ‌రిగిన అన్యాయం వేరొక‌రికి జ‌ర‌గ‌కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, విచార‌ణ‌ల‌ను వేగ‌వంతం చేసి నిందితుల‌కు త్వ‌రిత‌గ‌తిన శిక్ష అమ‌లు చేయ‌గ‌లిగితే అది ఇలాంటి ఫ‌గ‌ల‌కు పాల్ప‌డాల‌నుకునేవారికి ఓ హెచ్చ‌రిక కాగ‌ల‌ద‌ని వారు గ‌వ‌ర్న‌ర్ కి విన్న‌వించారు.

Read latest Movies News and Telugu News  Follow us on FacebookTwitter 

Tags: maa jeevita rajashekhar governor telangana hema disa case tollywood news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top