logo

దిశా కేసు: జయహో సజ్జనార్! అప్పుడు స్వప్నిక..ఇప్పుడు దిశా!


06-Dec-2019 10:51IST
disha case jayaho sajjanar then dreamydisha

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా హత్యకేసులో దిశాను శంషాబాద్ సమీపంలో చటాన్ పల్లి సమీపంలో అత్యంత పాశవికంగా హత్య చేసి ఆమెను తగులబెట్టిన చోటే నిందితులను పోలీసులు కాల్చిచంపారు. సీపీ సజ్జనార్‌ నేతృత్వంలో జరిగిన సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నిందుతులను ఘటన స్థలానికి తీసుకెళ్లి దిశ ఇంటి నుంచి బయలుదేరిన దగ్గరి నుంచి ఆమెను పెట్రోల్‌ పోసి కాల్చిన సమయం వరకు ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే అంశంపై సీన్‌ టూ సీన్‌ మొత్తం నిందితుల దగ్గర నుంచి వివరాలను సేకరిస్తున్న నేపథ్యంలో నిందితులు పోలీసులపై దాడి చేసి అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా...పోలీసులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఆ నలుగురు నిందుతులు అక్కడికక్కడే చనిపోయారు.

ఈ ఘటన తరువాత సోషల్ మీడియాలో పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిందితులకు సరైన శిక్ష పడిందంటూ ట్వీట్లు, పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. సీపీ సజ్జనార్‌ పేరు సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. తెలంగాణ పోలీసులు, సీపీ సజ్జనార్‌ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఘటన జరిగిన తర్వాత పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన వారే "సలాం పోలీసన్నా", "జై పోలీస్‌.. జై జై తెలంగాణ పోలీస్‌", "సాహో సజ్జనార్", "రియల్ లైఫ్ సింగం" అంటూ హ్యాష్ ట్యాగ్‌లు ట్వీట్ చేస్తున్నారు. సీపీ సజ్జనార్‌కు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద క్రేజ్ వచ్చింది. అలాగే పోలీసులు మంచి పనిచేశారంటూ ఎన్‌కౌంటర్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంలో 2008లో ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో జరిగిన ఘటనను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో.. అప్పుడు జిల్లా ఎస్పీగా సజ్జనార్‌గా ఉన్న సమయంలో స్వప్నికపై జరిగిన యాసిడ్ దాడి ఘటనలోని నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావిస్తున్నారు. మళ్లీ దిశ హత్యకేసులో అదే సీన్ రిపీట్ అయ్యిందంటున్నారు. రెండు ఘటనల్లోనూ సజ్జనార్ కీలక బాధ్యతల్లో ఉన్నారని.. అప్పుడు వరంగల్ ఎస్పీగా.. ఇప్పుడు సైబరాబాద్ సీపీగా ఆయనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. పోలీసులు మాత్రం చట్టం తన పని తాను చేసుకొని పోతుందంటున్నారు.





Tags: disha case jayaho sajjanar disha case justice for disha encounter justice for priyanakareddy

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top