logo

కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. చివరికి ఏమైందంటే ?


10-Dec-2019 17:31IST
man died in road accident in kadapa

కడప జిల్లాలోని జమ్మలమడుగు పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు దంపతులు బైక్ పై వెళ్తున్న సమయంలో వారి బైక్ మైలవరం ఉత్తర కాలువ వద్ద  అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా... భర్త  ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... మహిళ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారు ప్రయాణిస్తున్న బైక్ కు కుక్క అడ్డం రావడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా వారిని జమ్మలమడుగు టౌన్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్న రామకృష్ణ, అతని భార్య లక్ష్మీదేవిగా పోలీసులు గుర్తించారు. 

Read latest Crime News  and Telugu News   Follow us on FacebookTwitter 


Image result for road accident

Tags: road accident kadapa one man killed crime news

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top