logo

మోదీపై మరో కథనాన్ని ప్రచురించిన టైమ్స్ మ్యాగజైన్


29-May-2019 11:48IST
time magazine writes about narendra modi

కొద్ది రోజుల క్రితం సంచలనత్మకంగా మోదీపై ప్రధాన విభజనకారుడు అంటూ కథనాన్ని ప్రచురించిన ప్రపంచ ప్రఖ్యాత 'టైమ్' మ్యాగజైన్ ఇప్పుడు సరికొత్తగా మోదికి పాజిటివ్ కథ రాసింది. తాజాగా విడుదల చేసిన మ్యాగజైన్‌లో 'మోదీ దేశాన్ని ఏకం చేశారు' అంటూ మోదీని ప్రశంసిస్తూ మరో కథనాన్ని ప్రచురించింది. మంగళవారం విడుదల చేసిన ఈ మ్యాగజైన్‌లో మోదీ గురించి గొప్పగా వ్యాఖ్యానించారు. 'మోదీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కాదు. తన మద్దతును పెంచుకున్నారు. ఇందులో మరో విశేషం ఏంటంటే ఆయన ఇండియాలోని ఒక ప్రధాన తప్పుడు రేఖను దాటారు' అని రాసుకొచ్చారు.



టీ అమ్ముతూ వెనుకబడిన సామాజిక తరగతిలో పుట్టిన నరేంద్రమోదీ దేశంలోని అత్యున్నత స్థాయికి చేరడం హర్షనీయమని కథనంలో పేర్కొన్నారు. ఇన్ని దశాబ్దాల్లో ఏ ప్రధానమంత్రి దేశాన్ని ఐక్యం చేయలేదని, మోదీకి మాత్రమే ఈ ఘనతను సాధించారని రచయిత మనోజ్ లద్వా టైమ్‌లో రాసుకొచ్చారు. ఫలితాలకు ముందు మోదీకి వ్యతిరేకంగా రాసిన రాతలను, ఫలితాల తరువాత మద్దతుగా రాసింది ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్.   

Tags: Narendra Modi Time magazine Time magazine cover

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top