logo

ప్రాణాలు ప‌ణంగా పెట్టి..


29-May-2019 14:35IST
ts cop dives to save 2 labourers

క‌రీంన‌గ‌ర్‌: ప‌్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు త‌న‌ ప్రాణాల‌నే ప‌ణంగా పెట్టి వారి ప్రాణాలు కాపాడాడు ఓ సీఐ. వివ‌రాల్లోకి వెళ్తే..  క‌రీంన‌గ‌ర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన భద్రయ్యకు చెందిన ఓ పాడుబ‌డ్డ చేద బావిలో పూడిక తీసేందుకు గ్రామానికే చెందిన ఒల్లాల మల్లయ్య, మారెపల్లి రవీందర్ బావిలోకి దిగారు. దిగిన కొద్దిసేపటికే ఊపిరాడ‌క తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గాలి రావడం లేదు.. పైకి వ‌చ్చేందుకు శరీరం సహకరించట్లేదు అంటూ ఆర్తనాదాలు చేశారు. అనుమానం వచ్చిన భద్రయ్య వారిని పిలువగా ఎలాంటి స్పందన లేక‌పోవ‌డంతో వెంట‌నే గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే జమ్మికుంట పట్టణ సీఐ సృజన్‌రెడ్డి, అగ్నిమాపక సిబ్బందితోపాటు 108 వాహనంతో అక్కడికి చేరుకున్నారు. బావిలో దిగేందుకు స్థానికులు, ఫైర్ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ.. శ్వాస ఆడక పైకి వచ్చేశారు. సీఐ సృజన్‌రెడ్డి నిచ్చెన, తాడు సాయంతో బావిలోకి దిగి.. ఇద్దరిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా తాడు తెగింది. మరోసారి బావిలోకి దిగి బాధితులను బయటికి తీసుకొచ్చారు. శ్వాస అందక కొన ఊపిరితో ఉన్న ఇద్దరిని 108 ద్వారా ప్రాథమిక చికిత్స చేయించి, దవాఖానకు తరలించారు. వారిని కాపాడే క్రమంలో సీఐకి కూడా గాయాలు కావడంతో ఆయనకు చికిత్స చేయించారు. బావిలోకి దిగేందుకు ఎవరూ సాహసం చేయకపోగా.. స్వయంగా తానే ముందుకొచ్చి రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఐకి గ్రామస్థులు జేజేలు పలికారు.

Tags: Telangana Cop Labourers TS Police Karimnagar Koripelly Sujan Reddy

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top