logo

ప్రాణాలు తీసిన ఆన్ లైన్ జూదం


30-May-2019 15:01IST
online gambling of the victims

ఆన్‌లైన్‌లో పేకాట ఆడి చివ‌రకు అప్పుల పాల‌వ‌డంతో విర‌క్తి చెంది త‌ల్లీ, కొడుకు విషం తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నఈ విషాధ ఘ‌ట‌న బన్రూటిలో చోటుచేసుకుంది. కడలూరు జిల్లా బన్రూటి మేలప్పాళయం సుందర్‌నగర్‌కు చెందిన సిట్రరసు, భార్య రాజ్యలక్ష్మి (70) దంపతులు. వీరి కుమారుడు అరుల్‌వేల్‌ (36) కంప్యూటర్‌ ఇంజినీర్‌. అరుల్‌వేల్‌ తన స్నేహితులు, బంధువుల వద్ద నుంచి లక్షల అప్పు తీసుకుని ఆన్‌లైన్‌లో జూదంలో ఆడి బాగా నష్టపోయ్యాడు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వారు, నగదు తిరిగి ఇవ్వమని అరుల్‌వేల్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో నెల ముందు అరుల్‌వేల్‌ ఉద్యోగం వదిలేసి తల్లిదండ్రుల ఇంటికి వచ్చాడు. ఈ స్థితిలో అప్పు ఇచ్చిన వారు బన్రూటికి వచ్చి అప్పు తిరిగి ఇవ్వాలని అరుల్‌వేల్‌పై ఒత్తిడి పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన అరుల్‌వేల్‌ తనకు జీవించడానికి ఇష్టంలేదని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తల్లి రాజ్యలక్ష్మికి తెలిపాడు. అందుకు రాజ్యలక్ష్మి మనమిద్దరం కలసి ఆత్మహత్య చేసుకుందామని చెప్పింది. దీంతో తల్లి, కుమారుడు ఇద్దరూ విషం తాగి ఆత్యహత్యకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంటికి తిరిగి వచ్చిన సిట్రరసు రాజ్యలక్ష్మి నోటిలో నురుగు వచ్చిన స్థితిలో మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఆమె పక్కన అరుల్‌వేల్‌ స్పృహతప్పిన స్థితిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. వెంటనే సిట్రరసు స్థానికుల సాయంతో అరుల్‌వేల్‌ను బన్రూటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన గురించి బన్రూటి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Tags: online cards playing suicide

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top