logo

భర్త తల న‌రికిన భార్య‌


30-May-2019 15:54IST
Husband  wife cut off head

అస్సాం: ఎన్నో ఏళ్లుగా భ‌ర్త చేతిలో హింస‌కు గుర‌వుతున్న భార్య ఇక ఈ న‌ర‌కం నాకొద్ద‌నుకుంది అందుకే భ‌ర్త‌కు ఎదురు తిరిగింది. త‌ల‌ను న‌రికి స‌రాస‌రి పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లి లొంగిపోయింది. వివ‌రాల్లోకి అస్సాం లఖింపూర్‌ జిల్లాకు చెందిన గుణేశ్వరి బర్కతకి(48) భర్త ముధిరం(55). వీరికి ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. పైళ్లైన నాటి నుంచి భర్త.. గుణేశ్వరిని చిత్ర హింసలకు గురి చేస్తుండేవాడు. తిట్టడం, కొట్టడమే కాక కత్తి, గొడ్డలి వంటి మారణాయుధాలతో కూడా దాడి చేసేవాడు. ఇన్నాళ్లు భర్త ఆగడాలను భరించిన గుణేశ్వరికి ఓపిక నశించింది. దాంతో భర్త మీద కత్తితో దాడి చేసి చంపేసింది. అనంతరం అతని తలను వేరు చేసి ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో వేసుకుని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి..అదుపులోకి తీసుకున్నారు.

Tags: Husband wife murder assam police station

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top