logo

నేడే నో టొబాకో డే


31-May-2019 12:41IST
doday is no tobacco day



  • ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం


    చిత్తూరు: ధూమపానంతో ఒత్తిడి తగ్గుతుందనే అపోహ అందరిలోనూ ఉంటుంది. పొగ తాగడంతో కలిగే న‌ష్టాల‌ను ప్రజలకు అవగాహన కల్పించాలని జేసీ-2 కమలకుమారి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొగ తాగడం చట్టరీత్యా నేరమన్నారు. పొగాకుకు చాలామంది  బానిసలై అనారోగ్యానికి గురౌతున్నారని తెలిపారు. దీని వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, అనర్థాల గురించి ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలని చెప్పారు. 


    బహిరంగ ప్రదేశాలల్లో ధూమపానం చేయకుండా చూసుకోవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రామగిడ్డయ్య మాట్లాడుతూ పొగ తాగడం సరదాగా ప్రారంభమై వ్యసనంగా మారుతోందన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఈరోజు నుండి 15రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. అదనపు ఎస్పీ సుప్రజ మాట్లాడుతూ.. `జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో ధూమపానానికి బానిసలైన వారిలో చాలామందిని మార్చొచ్చన్నారు. ప్రస్తుతం సినిమా థియేటర్లలో స్లైడింగ్‌, యాడ్స్‌ వస్తున్నా.. అందరూ సమష్టిగా ప్రచారం చేస్తే మార్పు సాధ్యమని చెప్పారు. అనర్థాల గురించి తెలిసి కొందరు పొగ తాగేందుకు బానిసలవుతుంటే.. కొందరు తెలియక సరదాతో ప్రారంభించి, బానిసలుగా మారుతున్నారన్నారు. ప్ర‌జ‌ల మార్పుకోసం అవ‌గాహన కార్యక్రమాలు ఎంత‌గానో తోడ్ప‌డ‌తాయ‌న్నారు. ఎక్కడైనా పాన్‌పరాగ్‌, గుట్కా, ఖైనీ, ఇతర నిషేధిత పదార్థాలు ఉంటే వాటిపై స్థానిక పోలీసుస్టేషన్‌, లేక తమకు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.` అనంతరం అనర్థాలపై ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలకు సంబంధించి గోడపత్రికలు ఆవిష్కరించారు. 


Tags: world No Tobacco Day lung health tobaco Sigaret

Advertisement
Advertisement
Top