logo

విశ్వం కాలేజీ సమీపంలో దారుణం..


31-May-2019 14:36IST
Unfortunate near university college

  • ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి బ్యాగులో పాపను కాలువ గట్టుపై విడిచి వెళ్లిపోయారు
మదనపల్లె : ఇద్దరు యువకులు హంద్రీ-నీవా కాలువ గట్టుపై నెలలు నిండకనే జన్మించిన ఆడబిడ్డను విడిచి వెళ్లిపోయారు.పక్కనే మేకలు మేపుతున్న వ్యక్తి ఆ పాప‌ను అక్కున చేర్చుకుని ఆటోలో మదనపల్లె వైద్యశాలకు తీసుకొచ్చి వైద్యసిబ్బందికి అప్పగించాడు. విశ్వం కళాశాల సమీపంలోని హంద్రీ- నీవా కాలువ వద్ద మేకలు మేపుతుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంలో వచ్చి బ్యాగులోని ఆడబిడ్డను కాలువ గట్టుపై విడిచి వెళ్లిపోయారు. దీన్ని గమనించిన కాపరి ఆ బిడ్డను అక్కున చేర్చుకుని, పాప‌ను హుటాహుటిన ఆటోలో మదనపల్లె జిల్లా వైద్యశాలకు తీసుకొచ్చాడు.
 డాక్టర్లు ఆ బిడ్డను పరీక్షించి బరువు ఒకటిన్నర కిలోమాత్రమే ఉండడంతో ఏడోనెలలోనే ప్రసవం జరిగినట్లు నిర్ధరించారు.అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బిడ్డను పురిటిబిడ్డల వార్డులోని వార్మర్‌లో ఉంచి వైద్య సేవలందిస్తున్నారు.

Tags: abournent baby

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top