logo

రాష్ట్ర‌ అవ‌త‌ర‌ణ దినోత్స‌వానికి ఏర్పాట్లు ప్రారంభం


31-May-2019 14:41IST
arrengements starts  for state  formation day

భువనగిరి :   జూన్‌ 2న జరగనున్న  రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవ  వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.  వేడుకల కోసం  ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు.ఈ  ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయా అభివృద్ధి సంక్షేమ శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్‌ పరేడ్‌, స్టాళ్ల ఏర్పాటు, శకటాల ప్రదర్శనకు  స్థలాన్ని కేటాయించారు.  మున్సిపల్‌ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి  మైదానాన్ని చదును, ఇతర ఏర్పాట్లు చేయిస్తున్నారు. జేసీ రమేష్‌   మైదానాన్ని పరిశీలించి స్టాళ్లు, శకట ప్రదర్శన, అతిథులకు గ్యాలరీ ఏర్పాట్లపై అధికారులకు సూచనలిచ్చారు. గడువు తక్కువగా ఉండటంతో ఏర్పాట్లు వేగవంతం చేసే పనిలో అధికారులు ఉన్నారు.  అమరవీరుల స్తూపం వద్ద కూడా శుభ్రం చేసి పూలతో అలంకరించాలని జేసీ రమేష్ సూచించారు. పోలీసులు సన్నాహక కవాతును ప్రారంభించారు. ఏఆర్‌ఏసీపీ కిష్టయ్య ఆధ్వర్యంలో సన్నాహక కవాతు జరుగుతోంది.ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుద్దీపాల అలంకరణ చేయాలని ఆదేశించారు.  ఆయన వెంట ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్డీవో కార్యాలయ డీఏవో మందడి ఉపేందర్‌రెడ్డి, తహశీల్దార్‌ జనార్దన్‌రెడ్డి ఉన్నారు.

Tags: arrengements state formation day

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top