logo

వైట్‌హౌస్ ద‌గ్గ‌ర ఒంటిపై పెట్రోల్ పోసుకుని..


31-May-2019 14:47IST
petrol picked up at the white house

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ద‌గ్గ‌ర ఎన్నారై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అందరూ చూస్తుండగానే మంటల్లో కాలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతుడు భారత్‌కు చెందిన అర్నవ్‌గా గుర్తించారు. మేరీల్యాండ్‌ ప్రాంతంలో నివసిస్తున్న అర్నవ్‌ ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లాడని, తిరిగి ఇంటికి చేరుకోక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అతని కుంటుంబ సభ్యులు తెలిపారు. వైట్‌హౌస్‌ సమీపంలోని ఎలిప్స్‌ పార్క్‌ వద్ద అందరూ చూస్తుండగానే వంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దీనిపై ఎలిప్స్‌పార్క్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: n.r.i sucide america wight house

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top